ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం... ఓ వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం

ద్విచక్రవాహనాన్ని డీసీఎం ఢీకొట్టిన ఘటన హైదరాబాద్​లోని బాలాపూర్​ కూడలిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

one person died in road accident in hyderabad
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం... ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 8, 2020, 10:07 PM IST

హైదరాబాద్​ మీర్​పేట్ పీఎస్​ పరిధిలోని బాలాపూర్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో రహీం(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రహీం బాలాపూర్ చౌరస్తాలో బైక్ మెకానిక్​గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మీర్​పేట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.