పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యల్లావుల కన్నయ్య అనే వ్యక్తి నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
ఎంతకూ ఇంటికి రాకపోగా.. కుటుంబ సభ్యులు గాలించారు. తన వ్యవసాయ పొలంలోనే పురుగుమందు తాగి మృతి చెందిన కన్నయ్యను గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం