ETV Bharat / jagte-raho

ఆ ఇంట్లో భారీ చోరీ చేసింది అతని స్నేహితుడే: సీపీ

హైదరాబాద్​లో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని వరంగల్​లో అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి రూ.29.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

one person arrested who stolen amount in friend room in keesara
స్నేహితుడి సొమ్ము కాజేసిన దొంగ అరెస్ట్
author img

By

Published : Nov 18, 2020, 7:48 PM IST

హైదరాబాద్​లోని కీసరలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. గతంలో అతని గదిలోనే ఉంటున్న నరేశ్ అనే యువకున్ని వరంగల్​లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.29.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

స్నేహితుడి సొమ్ము కాజేసిన దొంగ అరెస్ట్

జీహెచ్ఎంసీలో ఇంజినీర్​గా పనిచేస్తున్న యోగేశ్వర్​కు వసతిగృహంలో ఉన్నప్పుడు నరేశ్ అనే యువకునితో పరిచయం ఏర్పడగా...ఇద్దరు ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. లాక్​డౌన్​ వల్ల ఉద్యోగం లేక నరేశ్​ తన ఊరికి వెళ్లిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెక్కీ నిర్వహించి తన దగ్గర ఉన్న తాళంతో స్నేహితుని సొమ్మును కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజ్​ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.