నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అహ్మద్షరీఫ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ వద్ద నకిలీ పులి చర్మాన్ని రూ.5 లక్షలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
భారీగా డబ్బులు సంపాదించాలని భావించిన షరీఫ్ ఈ తరహా మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడి వద్ద నుంచి నకిలీ పులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- ఇదీ చూడండి: జంట నగరాల్లో తగ్గిన రోడ్డు ప్రమాదాలు