ETV Bharat / jagte-raho

18 మంది ఓఎల్​ఎక్స్​ సైబర్​ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు - ఓఎల్ఎక్స్ మోసగాళ్లు అరెస్ట్​

ఓఎల్​ఎక్స్​లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ.. ఫోన్ చేసిన వారిని క్యూఆర్​ కోడ్​తో డబ్బులు కొల్లగొట్టిన కొల్లగొడుతున్న భరత్​పూర్​ ఓఎల్​ఎక్స్​ సైబర్​ నేరగాళ్ల ముఠాను సైబర్​ క్రైం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మొత్తం 18 మందిని అరెస్ట్​ చేశారు.

olx cyber gang arrest in hyderabad by ccs police
18 మంది ఓఎల్​ఎక్స్​ సైబర్​ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Oct 16, 2020, 10:28 PM IST

'ఖాకీ' సినిమా తరహాలో హైదరాబాద్​ పోలీసులు మరో సాహసం చేశారు. ముప్పుతిప్పలు పెడుతూ రూ. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న భరత్​పూర్​ ఓఎల్​ఎక్స్​ సైబర్​ నేరగాళ్ల ముఠాను పట్టుకున్నారు. స్థానిక పోలీసులు సాయంతో 18 మందిని అరెస్ట్​ చేశారు. ఓఎల్​ఎక్స్​లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ సంబంధించిన వారి నుంచి క్యూఆర్​ కోడ్​తో రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఇటీవల ఈ కేసులు ఎక్కువ అయినందున సీసీఎస్​ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

హైదరాబాద్​ నుంచి రాజస్థాన్​ వెళ్లిన పది మంది సైబర్​ క్రైం పోలీస్​ బృందం భరత్​పూర్​ పోలీసుల సాయంతో దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో మూడు పోలీసు వాహనాలను చేసిన నిందితులు, వారి కుటుంబసభ్యులు ధ్వంసం చేశారు. అయినా ముందుకెళ్లిన పోలీసులు... వాజిత్​ఖాన్​, సాహిల్​, సత్యవీర్​ సింగ్​, సత్యవీర్​ సింగ్​, మోహన్​ సింగ్​, ఇర్ఫాన్​ రాహుల్​, అజరుద్దీన్​, తారీఫ్​ఖాన్​, ఉమ్రాన్​ ఖాన్​, ఇర్ఫాన్​లను అరెస్ట్​ చేశారు. ఐదు రోజుల క్రితం ఎనిమిది మందిని అరెస్ట్​ చేయగా.. శనివారం మరో 10 మందిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: 24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.