కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్నందున మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు గుడుంబా తయారీకి అవసరమైన నల్ల బెల్లాన్ని విక్రయిస్తున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఓ వ్యాపారి అధిక మొత్తంలో నల్లబెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నాడనే సమాచారం మేరకు ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా ఉంచారు.
రాత్రి 2 గంటల సమయంలో బెల్లం రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నారు. సుమారు రూ.6 లక్షల విలువైన 19 టన్నుల బెల్లం, లారీ స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ సీఐ మహేందర్ సింగ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.