బోసి నోటితో అందంగా నవ్వుతూ... అల్లరి చేసిన ఆ పసి బిడ్డకు అప్పడే ఆయువు తీరి పోయింది. ఇంటి వద్ద ఆడుకుంటూ కిందకు పడి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
హరికృష్ణ, దివ్యశ్రీ దంపతుల తొమ్మిది నెలల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని బంధువులు, స్థానికులు వెంటనే స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండీ: నిజామాబాద్ కలెక్టరేట్లో భూబాధితుడు ఆత్మహత్మాయత్నం