ETV Bharat / jagte-raho

పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం - పోలీసుల ముసుగులో కొత్త మోసాలు

పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్లు... కొత్త మోసానికి తెరలేపారు. పోలీసు అధికారుల పేరుతో... నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలను సృష్టిస్తున్నారు. అత్యవసరంగా నగదు పంపించాలంటూ.. సందేశాలు పంపుతూ తోచినంత దండుకుంటున్నారు. కొన్నిరోజులుగా ఎస్​ఐ, సీఐ ఖాతాలపై కన్నేసిన కేటుగాళ్లు.... తాజాగా డీఐజీ స్థాయి అధికారి పేరిట నకిలీ ఖాతాను సృష్టించడం పోలీసు శాఖలో కలకలం రేపింది.

పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం

author img

By

Published : Sep 19, 2020, 5:04 AM IST

పోలీసుల ముసుగులో సైబర్‌ నేరగాళ్ల కొత్త మోసం

సైబర్‌ నేరస్థులు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. ఏకంగా డీఐజీ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను సృష్టించారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేసి ఆయన పరిచయస్తుల నుంచి డబ్బు దండుకునేందుకు యత్నించారు. ఈ తరహా మోసాలు సైబరాబాద్‌, వరంగల్‌, కమిషనరేట్‌లతో పాటు మహబూబాబాద్‌, నిర్మల్‌, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో బయటపడ్డాయి.

నకిలీ ఖాతాలు..

నేరస్థులు ఫేస్‌బుక్‌ ఖాతాలను చూసి వారి చిత్రాలను డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు తెలుసుకుని నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. ఖాతాపై పోలీసు అధికారుల చిత్రాలు ఉండేలా చూస్తూ... వారి స్నేహితులకు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. అత్యవసరంగా డబ్బు సర్దుబాటు చేయాలని అడుగుతున్నారు. ఎక్కువ మొత్తం కాకుండా పది, ఇరవై వేలలోపే అడుగుతున్నారు. కొందరు నగదు బదిలీ చేస్తుండగా... మరికొందరు అనుమానంతో ఫోన్లో మాట్లాడతామని చెప్పగా... చాటింగ్‌ నిలిపివేస్తున్నారు.

కొత్త ఎత్తుగడ...

నేరగాళ్ల కొత్త ఎత్తుగడ గురించి సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఫేస్‌బుక్‌ వినియోగించే వారు ప్రైవెసీ సెట్టింగ్‌లో వ్యక్తిగత వివరాలు అందరికీ కనిపించకుండా కేవలం స్నేహితులకే కనిపించేలా జాగ్రత్తలు తీసుకునే అవకాశముంటుంది. చాలా మంది ఈ విషయంలో ఏమరుపాటుగా ఉన్నట్టు సైబర్‌ క్రైం పోలీసులు గుర్తించారు. ఏళ్ల క్రితమే ఖాతాలు తెరిచి ఉండటం, చాలా వరకు వాటిని వినియోగించకపోవడం, ఆ దిశగా ఆలోచించడమే మానేశారు. దీన్నే సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలుచుకొని నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని గుర్తించారు.

డీఐజీ స్థాయి అధికారి పేరిట నకిలీ ఖాతా సృష్టించింది రాజస్థాన్‌లోని భరత్‌పూర్​కు చెందిన మోసగాళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండ ఎస్పీ ఖాతాను సృష్టించింది ఒడిశా రాష్ట్రానికి చెందిన సైబర్ నేరగాళ్లుగా పోలీసులు గుర్తించారు. సిద్దిపేట, మంచిర్యాల, వికారాబాద్‌ జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఒక్క రోజే చోటు చేసుకున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని.... మాటలు నమ్మి నగదు బదిలీ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: మోసం చేసిన భర్త.. కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.