హైదరాబాద్ ఉప్పల్ ప్రశాంతి నగర్లో విషాదం జరిగింది. నవ దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పల్ ఇందిరానగర్‌కు చెందిన అనితను కందుకూరి రమేశ్‌నాయుడు అనే వ్యక్తి ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసున్నాడు. రమేశ్ స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అనిత టైలరింగ్ పని చేస్తోంది.
అసలేమైంది...?
గురువారం అర్ధరాత్రి సమయంలో తామిద్దరూ చనిపోతున్నట్లు స్నేహితుని చరవాణికి సందేశం పంపారు. అనంతరం భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఇంటర్లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..