గురుగావ్‌కు చెందిన ఐదుగురు ఆన్లైన్ సూక్ష్మ రుణాల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి న్యాయస్థానాల్లో హాజరుపర్చి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
చరవాణి అప్లికేషన్ల ద్వారా సులభంగా రుణాలు ఇస్తూ భారీ వడ్డీ వసూలు చేస్తున్న కేసులో సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆరుగురు నిందితులను ఏడు రోజుల కస్డడీకి ఇవ్వాలని సైబర్ క్రైం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ... సోమవారం విచారణకు రానుంది. ఆన్లైన్లో రుణాలు ఇస్తున్న 330 అప్లికేషన్లను సైబర్ క్రైం పోలీసులు గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా గూగుల్ ప్లే స్టోర్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ లోన్ వేధింపులు.. బలవుతున్న యువత