అమెరికాలో నల్గొండ జిల్లా వాసి అనుమానాస్పదంగా మృతి చెందారు. కారులో మంటలు చెలరేగి దేవేందర్‌రెడ్డి(45) సజీవదహనమయ్యారు. దేవేందర్‌రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా దేవేందర్‌రెడ్డి పనిచేస్తున్నారు. తెరాస ఎన్‌ఆర్‌ఐ విభాగంలో సభ్యుడిగా ఉన్నారు.
ఎన్‌ఆర్‌ఐ దేవేందర్‌రెడ్డి మృతితో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. అతని కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. దేవేందర్‌రెడ్డి 22 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారని మృతుని బంధువులు పేర్కొన్నారు. మృతుడికి 7 సంవత్సరాల కూతురు ఉందని వెల్లడించారు. న్యూజెర్సీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు.