జగిత్యాల జిల్లా కొండగట్టు మెట్లదారిలో 2017 నవంబర్ 19న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మద్కపల్లికి చెందిన పాలెటి సంపత్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై అప్పటి ఎస్పీ అనంతశర్మ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినా ఆధారాలు లభించకపోవటంతో ఇన్నాళ్లు ఆ కేసు కొలిక్కిరాలేదు. అప్పటి నుంచి పోలీసులు ఈ కేసుపై నిఘా ఉంచి అతని భార్య స్వరూప సెల్‌ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేశారు.
స్వరూప పెంట సాగర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసేందుకు పథకం రచించింది. సంపత్ జగిత్యాల జిల్లా కొండగట్టు దైవ దర్శనానికి వెళ్లినట్టు తెలుసుకున్న స్వరూప. ఆమె తమ్ముడు రాము, ప్రియుడు సాగర్ ముగ్గురు కలిసి కొండగట్టుకు చేరుకున్నారు. మెట్లదారి వద్ద బీరుసీసా పగులగొట్టి ముగ్గురు కలిసి హత్యకు చేశారు.
సాగర్‌పై అనుమానంతో మల్యాల పోలీసులు పలు మార్లు స్టేషన్‌కు పిలిపించారు. తనకు ఈ హత్యకు సంబంధం లేదని ఈ ఏడాది ఫిబ్రవరి 28న మల్యాల పోలీస్‌స్టేషన్‌లోని బాత్‌రూంలో గొంతుకోసుకున్నాడు. అయినా పోలీసులు ఈ కేసును వదిలిపెట్టకుండా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు సంపత్ భార్య స్వరూప, ఆమె తమ్ముడు రాము, ప్రియుడు సాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదించిన పోలీసులను జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అభినందించారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!