ETV Bharat / jagte-raho

తమ్ముడి హత్య.. తల్లితో కలిసి అంత్యక్రియలకు ఏర్పాట్లు

రోజూ మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తి తన తమ్ముడిని బండరాయితో మోది హతమార్చాడు. అనంతరం సహజ మరణంగా చిత్రీకరించి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో దారుణం జరిగిది.

murder at nandev wada in nizamabad
దారుణం: కుటుంబ కలహాలతో తమ్ముడిని హతమార్చిన అన్న
author img

By

Published : Jun 30, 2020, 12:58 PM IST

నిజామాబాద్​లోని నాందేవ్ వాడకు చెందిన రూపేశ్​, సతీశ్​లు అన్నదమ్ములు. సతీశ్​ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సోమవారం సతీశ్​ మద్యం తాగొచ్చి అన్న రూపేశ్​తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రూపేశ్, తమ్ముడిని​ బండరాయితో కొట్టి హతమార్చాడు.

అనంతరం తల్లి మమతతో కలిసి​ హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

మూడో పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్సై సంతోశ్​లు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో రూపేశ్​, సతీశ్​ను బండరాయితో కొట్టి చంపాడని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్మశాన వాటిక సిబ్బంది సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు నిందితులు రూపేశ్​, తల్లి మమతలను అరెస్టు చేసినట్లు వివరించారు.

ఇదీచూడండి: అక్కలపై ఉన్మాదం... ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.