ETV Bharat / jagte-raho

అక్కాతమ్ముడిని మింగేసిన జంపన్నవాగు

తమ్ముడు అంటే అక్కకి పంచ ప్రాణాలు. ఒక్క క్షణం కూడా తమ్ముడిని విడిచిపెట్టి ఉండలేదు. అందుకేనేమో మృత్యువులోను వారి బంధం వీడలేదు. జంపన్న వాగులో నీట మునిగిన తమ్ముడిని కాపాడేందుకు వెళ్లిన జాహ్నవి సైతం నీటిలో గల్లంతైంది. ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Mulugu District Thadwai Zone Medaram Jampanna Wagu drowned children
మృత్యువులోను వీడని అక్క తమ్ముళ్ల బంధం
author img

By

Published : Jan 17, 2021, 7:14 AM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో మునిగి అదే గ్రామానికి చెందిన అక్కా తమ్ముడు దుర్మరణం చెందారు. మెండు సంపత్‌రెడ్డి, అనిత దంపతుల పిల్లలు జాహ్నవి(11), హేమంత్‌(9) హైదరాబాద్‌లోని చిన్నమ్మ దగ్గర ఉంటూ చదువుకొంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పిల్లలిద్దరూ 8 నెలలుగా మేడారంలోనే ఉంటున్నారు.

వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం కొసం హైదరాబాద్‌ నుంచి వచ్చిన తమ చిన్నమ్మ, బాబాయి, వారి పిల్లలతో కలిసి స్నానం చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో తొలుత హేమంత్‌ నీట మునిగాడు. తమ్ముడిని కాపాడేందుకు వెళ్లిన జాహ్నవి సైతం నీటిలో గల్లంతైంది. విషయం తెలుసుకొన్న గ్రామస్థులు వచ్చి చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: పెళ్లి కాలేదని యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.