జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తల్లి, కూతురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తల్లి వేమూనురి సమత(35), కూతురు అశ్విని(13) సోమవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ... ఒకరు అరెస్ట్