ETV Bharat / jagte-raho

మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం

ఆరేళ్లు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 3 నెలలుగా సహజీవనం చేశాడు. చివరికి మరొకరిని వివాహం చేసుకున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం
మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం
author img

By

Published : Nov 21, 2020, 9:26 AM IST

Updated : Nov 21, 2020, 10:15 AM IST

పెళ్లి చేసుకుంటానని గణేశ్​ అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడంటూ ఏపీలోని చిత్తూరు జిల్లా పెద్దపంజాణి పోలీస్​స్టేషన్​లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఇంతకాలం సహజీవనం చేస్తూ.. మరొకరిని వివాహమాడాడని పేర్కొంది.

మూడు నెలలుగా సహజీవనం.. మరొకరితో వివాహం

గంగవరం మండలం మిట్టమీద కురప్పల్లికి చెందిన గణేశ్​​, పెద్దపంజాణి మండలానికి చెందిన ఈ యువతి.. గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పలమనేరులోని ఓ ప్రైవేటు కళాశాల​లో చదువుకునే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. రెండేళ్ల క్రితం ఇరువురూ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని.. మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా గణేశ్​ సొంత గ్రామానికి చేరుకున్నాడు. బాధితురాలు ఫోన్ చేస్తున్నా... ఇంతకుముందులా పట్టించుకోవడం లేదు. అసలేమైందని యువతి ఆరా తీయగా.. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: 'మదనపల్లెను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు'

Last Updated : Nov 21, 2020, 10:15 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.