ETV Bharat / jagte-raho

రియల్​ ఎస్టేట్​ వెంచర్​పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం - గంజాయి వార్తలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తిరుమల రియల్​ ఎస్టేట్​ వెంచర్లో మెదక్​ ఎన్​ఫోర్స్​మెంట్​ టీం చేసిన దాడిలో ఎండు గంజాయి, మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం విలువ సుమారు రూ. 3,70,000 ఉంటుందని తెలిపారు.

medak enforcement attack on thirumala real estate venture
రియల్​ ఎస్టేట్​ వెంచర్​పై దాడి.. గంజాయి, మత్తు పదార్థాలు స్వాధీనం
author img

By

Published : Nov 7, 2020, 3:41 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తిరుమల రియల్ ఎస్టేట్ వెంచర్లో మెదక్ ఎన్​ఫోర్స్​మెంట్ టీం దాడి చేసింది. ఆ దాడిలో ఎండు గంజాయి, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రియల్ ఎస్టేట్ వెంచర్​లో ఒక వాహనంలో రెండు ప్లాస్టిక్ బాటిళ్లు, 5 గ్రాముల హశిష్ ఆయిల్ అనే మత్తు మందు, 10 గ్రాముల గంజాయి నూనె లభ్యమైంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్​కి తరలించారు.

విచారణలో రంగారెడ్డి జిల్లా చందానగర్​లో ఓ ఇంట్లో దాడి చేయగా 72 ప్లాస్టిక్ హశిష్ ఆయిల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్​ అధికారిణి గాయత్రి తెలిపారు. అంతే కాకుండా 11.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 3,70,000 ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ట్రాఫిక్​పై అవగాహన కల్పించడం కోసమే 2కే రన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.