ETV Bharat / jagte-raho

వివాహిత హత్యా... అత్యాచారం చేసి చంపేశారా? - వివాహిత హత్య వార్తలు

ఓ వివాహిత అపహరణకు గురై... మృతదేహంగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. మృతురాలి దేహంపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

married-women-rape-and-murder-in-sanagreddy-district
వివాహిత హత్యా... అత్యాచారం చేసి చంపేశారా?
author img

By

Published : Nov 5, 2020, 2:34 PM IST

మియాపూర్‌కు చెందిన ప్రేమలతకు... సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని కొల్లూరు తండాకు చెందిన ఓ వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోగా... పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది.

మంగళవారం సాయంత్రం పని నుంచి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు... ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారని ప్రేమలత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం దాటిన తర్వాత... కొల్లూరు శివారులోని ఓ రేకుల షెడ్డులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ సమయంలో మృతురాలి ఒంటిపై దుస్తులు లేవని పేర్కొన్నారు. మృతదేహాన్ని పటాన్ చెరువు ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆలయ భూములను కూడా వదలని భూకబ్జాదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.