ETV Bharat / jagte-raho

మావోయిస్టు తెలంగాణ కమ్యూనికేషన్ ఇన్​ఛార్జి దంపతుల లొంగుబాటు - వరంగల్​ నేర వార్తలు

ఈ ఏడాది 45 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వరంగల్​ సీపీ ప్రమోద్​కుమార్​ వెల్లడించారు. యాలం నరేందర్​ అలియాస్​ సంపత్​, పోడియం దేవి దంపతులు సీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నది గ్రహించి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని సీపీ వెల్లడించారు.

Maoist action team member surrendered
లొంగిపోయిన మావోయిస్టు యాక్షన్​ టీం సభ్యుడి దంపతులు
author img

By

Published : Dec 30, 2020, 8:35 PM IST

మావోయిస్టులు యాలం నరేందర్ అలియాస్ సంపత్, పోడియం దేవి దంపతులు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్​కుమార్ ఎదుట లొంగిపోయారు. వీరిద్దరి మీద ఉన్న రివార్డ్ సొమ్ము రూ. 5 లక్షల చెక్​ను.. సీపీ వారికే అందించారు.

ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​కు చెందిన నరేందర్​.. వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కమాండర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కమ్యూనికేషన్ ఇన్​ఛార్జి, యాక్షన్ టీం సభ్యుడిగా పనిచేస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన నరేందర్ భార్య పొడియం దేవి మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో దళ సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

నరేందర్​పై ఆరు కేసులు నమోదయ్యాయని సీపీ ప్రమోద్​ తెలిపారు. 2009లో దమన్ జాడే ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో నలుగురు పోలీసులు మరణించారని.. అందులో నరేందర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. 2012లో కర్నపల్లి, ఎర్రెల్లి అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లోనూ నరేందర్ ఉన్నట్టు తెలిపారు. 2017లో పోలీసులను హతమార్చేందుకు చింతూరు ప్రాంతంలో మందుపాతరలను పేల్చిన ఘటనలోనూ నరేందర్ హస్తముందని సీపీ స్పష్టం చేశారు.

ఈ ఏడాదిలో మొత్తం 45 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సీపీ వెల్లడించారు. మావోయిస్టు పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నది గ్రహించి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారన్నారు.

ఇవీచూడండి: యువకుడిపై అత్యాచారం కేసు... నిందితుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.