ETV Bharat / jagte-raho

ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

ఓ వ్యక్తి ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

man suicide in peddapalli district
ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Sep 18, 2020, 11:30 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఈరోజు ఉదయం గోల్కొండ సాయి కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు ముగ్గురి వేధింపులే కారణమని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త డైరీ మిల్క్​ ప్రొడక్ట్స్​ అనే వ్యాపారాన్ని బుర్ర శ్వేత, బుర్ర రాజు, కరుణాకర్​లతో కలిసి పెట్టారని తెలిపారు. వారు తన భర్తను వ్యాపారంలో మోసం చేశారని పోలీసులకు వివరించారు.

ఈరోజు ఉదయం తాము ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకుని చనిపోయారని తెలిపారు. తన భర్త చనిపోయే ముందు తన చావుకు కారణం బుర్ర శ్వేత, బుర్ర రాజు, కన్నూరి కరుణాకర్​లే కారణమని లేఖ రాశారని చెప్పారు. వారి ముగ్గురిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

man suicide in peddapalli district
ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి: తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.