ETV Bharat / jagte-raho

బాలికపై లైంగికి దాడికి యత్నం.. నిందితునికి ఐదేళ్ల జైలు - అడ్డగూడూరులోని సాంఘిక సంక్షేమ పాఠశాల తాజా వార్తలు

బాలికపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లిన విద్యార్థినిపై దాదాసాహెబ్‌ అత్యాచార యత్నం చేశాడు.

man sentenced to five years in prison for attempting to sexually assault a girl at a school in Adda gudur
బాలికపై లైంగికి దాడికి యత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష
author img

By

Published : Jan 9, 2021, 12:50 PM IST

పాఠశాలలో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై లైంగికి దాడికి యత్నించిన సూర్యాపేటలోని గొల్లబజారుకు చెందిన షేక్‌ దాదాసాహెబ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ.. పోక్సో కోర్టు న్యాయమూర్తి భవాని తీర్పు చెప్పారు. రూ.10 వేల జరిమానా విధించారు.

అడ్డగూడూరులోని సాంఘిక సంక్షేమ పాఠశాల భవనానికి పెయింటింగ్‌ పనుల నిమిత్తం వచ్చిన దాదాసాహెబ్‌.. పాఠశాలలో దుస్తులు మార్చుకోవడానికి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక అతని నుంచి తప్పించుకొని ప్రిన్సిపల్‌కు తెలపడంతో అతనిపై అడ్డగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి, ఛార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో పోక్సో చట్ట ప్రకారం అతనికి జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్‌ తరపున అదనపు పీపీ త్యాగరాజు వాదించారు.

ఇదీ చూడండి: మధ్యాహ్నం కన్యాదాత.. అర్ధరాత్రి మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.