రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ భూక్య రాజు అనే వ్యక్తి మృతి చెందాడు.
స్థానికులు వెంటనే రాజును మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రాజు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. బైక్ను ఢీకొట్టిన ఇసుకట్రాక్టర్... ఒకరు మృతి