జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్నకోడెపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో నీట మునిగి మృతి చెందాడు. భిక్షపతి ఉదయం చేపలు పడుతూ.. ఒక్కసారిగా నీళ్లలో పడిపోయి చనిపోయాడు. చేపలకు వెళ్లిన వాళ్లు భిక్షపతిని చూసి బయటకు తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన