ETV Bharat / jagte-raho

నెలరోజుల వ్యవధిలో తండ్రీకుమారులు మృతి.. దుఃఖసాగరంలో కుటుంబం - man dead in nizamabad

వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లనాయక్​ తండాలో చోటు చేసుకుంది. నెలరోజుల క్రితమే యువకుని తండ్రి మృతి చెందగా.. ఇద్దరు మగ దిక్కులను కోల్పోవడం వల్ల ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది.

man dead with electric shock in nizamabad
నిజామాబాద్​లో యువకుని మృతి
author img

By

Published : Sep 29, 2020, 10:54 AM IST

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లనాయక్​ తండాలో వినోద్​(21) అనే యువకుడు పొలం పనులు చేస్తుండగా.. విద్యుదాఘాతంతో మృతిచెందాడు. నెలరోజుల క్రితం తండ్రి గుండెపోటుతో మృతి చెందగా.. వినోద్ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు.

తండాకు చెందిన బాదావత్ హరిదాస్​కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు(21) ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేసిన హరిదాస్​ నెలరోజుల క్రితం గుండె జబ్బుతో మృతి చెందాడు. తండ్రి మరణంతో వినోద్​పై కుటుంబ భారం పడింది. అలవాటు లేకున్నా వినోద్​ వ్యవసాయ పనులు చూసుకునేవాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి వెళ్లిన వినోద్​ బోరు వద్ద అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు.

చాలా రోజులుగా బోరుకు విద్యుత్​ సరఫరా అవుతోందని, మరమ్మతులు చేయించడంలో జాప్యం అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు మగ దిక్కులను కోల్పోయిన కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.