చర్లపల్లి-మౌలాలి రైలు మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఘటనాస్థలికి రైల్వే పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని వద్ద ఉన్న కీ చైన్‌పై వినోద్ అని రాసి ఉన్నట్టు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాడు, చని పోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: సైబర్ నేరాలపై అవగాహన అవసరం: సీపీ ప్రమోద్ కుమార్