ETV Bharat / jagte-raho

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని‌ ఢీకొట్టింది. విద్యుదఘాతంతో తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు.

PRAKASAM ACCIDENT
విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు
author img

By

Published : May 14, 2020, 8:53 PM IST

కూలీ పనికెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న తొమ్మిది మంది కూలీల జీవితాలు చీకటైపోయాయి. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండల రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్​.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడం వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నారు. ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌తో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్​కు తరలించనున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెసులుబాట్లు కల్పించడం వల్ల ఇవాళ ఉదయం కొందరు కూలీలు ట్రాక్టర్‌పై మిరప కోత పనులకు వెళ్లారు. గతంలో ఆటోల్లో వెళ్లే వీరంతా లాక్‌డౌన్‌ కారణంగా వాటికి అనుమతి లేనందున ట్రాక్టర్‌లో పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం మిరప కోత పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఇంటికి చేరుకొనే లోపే విగతజీవులుగా మారడం అందరినీ కలచివేస్తోంది.

మృతులు:

కోటేశ్వరమ్మ(50), లక్ష్మమ్మ(65), కాకుమాను రమాదేవి(55), కాకుమాను కుమారి(45), కాకుమాను రమశ్రీ(40), కాకుమాను అమూల్య, రవిశంకర్‌(18), కాకుమాను శివ(16), కాకుమాను మౌనిక(14)

సీఎం దిగ్భ్రాంతి..

ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

ఇవీ చూడండి: విషాదం మిగిల్చిన ఈత సరదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.