రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిషత్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, మన్సాన్పల్లి పంచాయతీ కార్యదర్శి గీత.. లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు.
మన్సాన్పల్లి గ్రామంలో ఐదున్నర ఎకరాలల్లో ప్లాట్లు వేసి విక్రయించేందుకు జేబీఎన్ స్థిరాస్తి సంస్థ నిర్ణయించింది. లేఅవుట్‌కు అనుమతి ఇచ్చేందుకు.. సంబంధిత అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్ కలిసి 10 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఏడున్నర లక్షలు ఇచ్చేందుకు జేబీఎన్ స్థిరాస్తి వ్యాపార సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం అనిశాను ఆశ్రయించారు.. సంస్థ ప్రతినిధులు.
వారు లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో అనిశా అధికారులు దాడులు చేశారు. మండల పరిషత్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ రూ.2 లక్షలు, కార్యదర్శి గీత, మన్సాన్ పల్లి గ్రామ సర్పంచ్ అరుణ భర్త రమేశ్, ఉప సర్పంచ్ నర్సింహ కలిసి ఐదున్నర లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లాకర్ గుర్తింపు..
రాజేంద్రనగర్ బండ్లగూడలోని మండల పరిషత్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఇంట్లో అనిశా సోదాలు చేశారు. రూ.2.10 లక్షలు, 12 తులాల బంగారం, రెండెకరాల భూమి పత్రాలు, రూ.70 వేల విలువైన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అలహాబాద్ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించారు.
ఇవీచూడండి: లైవ్ మర్డర్: సీసీ కెమెరాలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ హత్య