సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన హారిక ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 8న వెంకటాపూర్ నుంచి వెళ్లిపోయిన ఆనంద్, హారిక ఊరి దగ్గరలోని మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం మామిడితోటలోని ఓ గదిలో వారిని గుర్తించిన ఆనంద్ తండ్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందింది. శనివారం సాయంత్రం ఆనంద్ చనిపోగా... ఆదివారం తెల్లవారుజామున హారిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: 'దిశ ఎన్కౌంటర్'ను సినిమాగానే చూడండి: నట్టి కుమార్