ETV Bharat / jagte-raho

పాలెం శివారులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట

వారిద్దరు దివ్యాంగులు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు ఆ ప్రేమ జంట నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారులో జరిగింది.

lovers commited suicide in nalgonda district
ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
author img

By

Published : Sep 10, 2020, 12:06 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారు పొలాల్లో ఓ ప్రేమ జంట నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు షేక్​ మస్తాన్​ వాలీ, అశ్వినిగా గుర్తించారు. నిడమనూరు మండలం కుంటిగెర్లకు చెందిన షేక్​ మస్తాన్​ వాలీ, హుమయూన్​నగర్​కు చెందిన అశ్విని దివ్యాంగులు.

వీరు ఇద్దరు హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు బుధవారం నాగార్జునసాగర్​ వెళ్లారు. తిరిగి వెళ్తున్న సమయంలో పాలెం శివారులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టం అద్భుతాలు సృష్టించదు: చాడ వెంకట్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.