ETV Bharat / jagte-raho

నాలుగేళ్ల ప్రేమ... పెళ్లి అనగానే మొహం చాటేశాడు - ప్రియుని ఇంటి ముందు యువతి ధర్నా

నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని యువతి బలవంతం చేయగా మొహం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో ప్రియుని ఇంటి ముందు ధర్నా చేపట్టింది.

lover protest against her boy friend in kamareddy district
నాలుగేళ్ల ప్రేమ... పెళ్లి అనగానే మొహం చాటేశాడు
author img

By

Published : Oct 11, 2020, 2:10 PM IST

Updated : Oct 11, 2020, 3:08 PM IST

నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన అన్న పెళ్లి తర్వాత చేసుకుంటానని మాట ఇచ్చాడు. తర్వాత ముఖం చాటేశాడు. చేసేది లేక బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతి కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.

"పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి పూర్తిగా వాడుకున్నాడు. గర్భవతిని చేసి... అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని నిలదీయగా తన అన్న పెళ్లి అయిన తర్వాత అని నమ్మించి తప్పించుకుంటూ తిరిగాడు. ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదు. కులాలు వేరుగా ఉన్నాయి, పెళ్లి చేసుకోవద్దని వారి కుటుంబ సభ్యులు బెదిరించారు."

-బాధితురాలు

నాలుగేళ్ల ప్రేమ... పెళ్లి అనగానే మొహం చాటేశాడు

మోసపోయానని గ్రహించిన బాధిత యువతి ఎస్పీ శ్వేతకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రియుడితో మహిళ.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన కానిస్టేబుల్

Last Updated : Oct 11, 2020, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.