మిర్చి వ్యాపారి నుంచి రూ.70 లక్షలతో లారీ డ్రైవర్ ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి సోలాపూర్‌లో మిరపకాయలు విక్రయించి, అదే లారీలో తిరుగు పయనమయ్యారు. పటాన్చెరు సమీపంలోని బాహ్య వలయ రహదారి వద్ద... డబ్బు లారీలోనే పెట్టి మూత్రవిసర్జనకు లారీ దిగాడు. అదే అదనుగా భావించిన డ్రైవర్ లారీతో సహా పరారయ్యాడు.
అప్రమత్తమైన బాదితుడు పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సమీప పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లోని పంజాబీ దాబా వద్ద డ్రైవర్ లారీ వదిలిపెట్టి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: సెప్టెంబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!