హైదరాబాద్ రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడ సమీపంలో లారీపై తాడిపత్రి పరుస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఫాయ్యజ్ అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందడు. ఇతను చింతల్మెట్ ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించిన పోలీసులు... డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇవాళ సాయంత్రం ట్రాన్స్పోర్ట్ ఆర్డర్‌ను బట్టి బయలుదేరగా వర్షం వస్తుందని గమనించి లారీ ఆపాడు. లారీలో సరుకు తడవకుండా.. తాడిపత్రి వేసేందుకు లారీ పైకి వెళ్లాడు. అక్కడ వేలాడుతున్న వైర్లను గమించని అతను... ప్రమాదవశాత్తు వైర్లు తగిలి.. అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం