హైదరాబాద్ బాలాపూర్ పరిధి ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంలో పనిచేస్తోన్న 20మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశామన్నారు. గాజుల పరిశ్రమల్లో సోదాలు నిర్వహించగా బిహార్‌కు చెందిన బాలకార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ చెప్పారు.
వెట్టి చాకిరీ...
బిహార్ నుంచి అక్రమంగా పిల్లలను తరలించి కనీసం సరైన భోజనం పెట్టకుండా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వెల్లడించారు. వారితో అర్ధరాత్రి వరకు పనిచేయిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. నిందితులు బిహార్‌కు చెందినవారేనని తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పిల్లలను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ వివరించారు.
ఇదీ చదవండి: రేప్ కేసు పెట్టేందుకు 800 కి.మీ ప్రయాణం!