సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పంట పొలాల వద్ద చిరుతను చూసిన పలువురు రైతులు సర్పంచ్ శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. వెంటనే సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీశ్ కుమార్, బీట్ ఆఫీసర్ కిశోర్‌లు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. గుర్తులు హైనాకి చెందినవిగా ప్రాథమికంగా నిర్ధారించారు.

గ్రామంలో హైనాలు సంచరిస్తున్నాయని.. పులి లేదని అటవీ అధికారులు పేర్కొన్నారు. గ్రామస్థులు ఆందోళన చెందొద్దని సూచించారు. అనుమానిత జంతువులను గుర్తుపట్టడానికి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.