ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలవాసులను పులి భయం వీడటం లేదు. మంగళవారం రోజున తాంసి-కె అటవీ ప్రాంతంలో ఆవు, లేగదూడ రెండు హతమవడం స్థానికంగా భయాందోళనకు దారితీసింది. మృత్యువాతపడ్డ పశువులు గ్రామానికి చెందిన వాన్‌కడే దామోదర్‌విగా గుర్తించారు. తాంసి నుంచి హత్తిఘాట్‌కు వెళ్లే దారిలో ఈ ఘటనలు వెలుగుచూశాయి.
సోమవారం రోజున రెండు పశువులు కనిపించకపోవటం వల్ల వాటి జాడ కోసం వెతకగా.. పులి దాడి బయటపడింది. అటవీఅధికారులకు సమాచారం ఇచ్చినట్లు సర్పంచి కరీం తెలిపారు. వారం పది రోజుల్లో జరిగిన పులి వరసదాడులతో పరిసర గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు.