గుట్టుచప్పుడు కాకుండా గుట్కా తయారు చేస్తున్న వ్యక్తి ఆటకట్టించారు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలోని బాలాజీనగర్‌లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.45 లక్షల విలువైన గుట్కా పాకెట్లు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు సంతోశ్నగర్కు చెందిన లతీఫ్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని డీసీపీ సురేందర్‌రెడ్డి సందర్శించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్వోటీ సీఐ, ఎస్సై రాజు, సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం పట్టుబడిన గుట్కాతో పాటు నిందితున్ని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు.
![Large scale gutka manufacturing person caught by lb nagar sot police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-22-22-sot-raid-gutkha-godown-av-ts10003_22122020131010_2212f_1608622810_263.jpg)