ETV Bharat / jagte-raho

కర్నూలులో ప్రమాదం... రాష్ట్రానికి చెందిన 15 మంది మృతి - 13 మంది మృతి

ఘోరం జరిగిపోయింది. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి చూపులకు వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ కుటుంబసభ్యులను మృత్యువు రూపంలో ముంచుకొచ్చిన వోల్వో బస్సు.. కబళించివేసింది.

kurnool road accident
author img

By

Published : May 11, 2019, 9:31 PM IST

Updated : May 11, 2019, 11:37 PM IST

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని చెక్ పోస్టు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా కలిసి వెళ్తున్న తుపాను వాహనాన్ని... వోల్వో బస్సు ఢీ కొట్టిన ఘటనలో 15 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలోనే 13 మంది దుర్మరణం పాలవగా... ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణం విడిచారు. చికిత్స పొందుతూ ఇంకొకరు చనిపోయారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతులు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం వాసులుగా గుర్తించారు.

నిశ్చితార్థానికి వెళ్లి

ఉదయం పెళ్లి చూపులకని గుంతకల్లు వెళ్లిన రామాపురం వాసులు... నిశ్చితార్థం చేసుకుని తిరుగుప్రయాణమయ్యారు. వెల్దుర్తి సమీపంలోకి రాగానే... వోల్వో బస్సు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు... వెల్దుర్తి చెక్ పోస్టు వద్ద అదుపు తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి... డివైడర్ ఎక్కి... అవతలివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో అటువైపునుంచి వస్తున్న తుపాన్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి స్థానికులు చేరుకుని... జీపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో వాహనాలు తొలగించారు.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్​ను సీఎం ఆదేశించారు.

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం , నాగాయలంక లో అపోలో హాస్పటల్ హైదరాబాద్ మరియు సేవ్ ద లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో 4, 5 తేదీల్లో నాగాయలంక లో ఉదరకోశ వ్యాధులు పై ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది ఉదరకోస సంబంధ మైన టెస్ట్ లు చేయించుకున్నారు, కొందరిలో క్యాన్సర్ లక్షణాలు కూడా గుర్తించినట్టు డాక్టర్ సోమ శేఖర్ తెలిపారు, ప్రారంభ దశలో గుర్తించిన కాన్సర్ ను నివారించవచ్చు అని డాక్టర్ తెలిపారు. నాగాయలంక లో స్థానిక క విద్యా భారతి స్కూల్ నందు ప్రముఖ సీనియర్ డాక్టర్ కె . ఎస్. సోమశేఖర్ మరియు డాక్టర్ శివ చరణ్ రెడ్డి ఇతర ప్రముఖ డాక్టర్ల బృదం వైద్య శిబిరం నిర్వహించారు

వాయిస్ బెట్స్
డాక్టర్ కె. సోమశేఖర్, m.d,gastroenterologist

Body:నాగాయలంక లో ఉచిత ఉదర కోశ వ్యాధుల వైద్య శిబిరం

Conclusion:నాగాయలంక లో ఉచిత ఉదర కోశ వ్యాధుల వైద్య శిబిరం
Last Updated : May 11, 2019, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.