కార్లను అద్దెకు తీసుకుని వాటిని మరొకరికి తాకట్టు పెట్టి మోసాలకు పాల్పడుతున్న వినోద్ కుమార్ అనే వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు తెలియజేశారు.
హామీ ఇచ్చి..
యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందిన వినోద్ బీహెచ్ఈఎల్లో ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, మూసాపేటలో కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. కార్లను అద్దెకు తీసుకుని ప్రతీ నెలా యజమానులకు డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. మొదటి రెండు నెలలు చెల్లించి ఆతరువాత అద్దె, కార్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరిగేవాడు.
జల్సాలు చేసి..
అద్దె కార్లే ఇతరులకు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. యజమానులు పోలీసులను ఆశ్రయించడంతో.. కేసు నమోదు చేసుకొని వినోద్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు. ఇన్నోవా, వోక్స్‌వేగన్, వెంటో, ఎర్టిగా, స్విఫ్ట్ డిజైర్ స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. నిందితున్ని రిమాండుకు తరలించనున్నామని పేర్కొన్నారు.