అలహాబాద్ బ్యాంకు నుంచి 137 కోట్ల రూపాయల రుణం తీసుకుని మోసం చేశారన్న అభియోగంపై హైదరాబాద్లోని కాసుకుర్తి సుజాత కన్స్ట్రక్షన్స్పై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు నివేదికలు, ఫోర్జరీ పత్రాలు సమర్పించి 137 కోట్ల రూపాయల రుణం తీసుకుని.. ఇతర అవసరాల కోసం మల్లించి... ఆ తర్వాత రుణం ఎగ వేసినట్లు బ్యాంకు విచారణలో తేలింది.
అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనం కావడంతో... ఇండియన్ బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేఎస్సీపీఎల్ ఎండీ కె.జగన్మోహన్ రావు, కంపెనీ డైరెక్టర్లు సుజాత, రాజేష్, రాధిక, మౌనికపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఇదీ చూడండి : మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ