ETV Bharat / jagte-raho

ప్రజల ప్రాణాల మీదకు తెస్తోన్న ఇసుక రవాణా

author img

By

Published : Dec 30, 2020, 12:21 PM IST

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఇసుక లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పరిమితికి మించి సామర్థ్యంతో సాగుతున్న ఇసుక తరలింపు... ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడు తీవ్రగాయాల పాలవడంతో... స్థానికులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. నిత్యం వందల లారీల ప్రయాణంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

kamareddy-district-people-facing-problems-with-sand-mafia
ప్రజల ప్రాణాల మీదకు తెస్తోన్న ఇసుక రవాణా

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్, వాజిద్‌నగర్, హస్గుల్, ఖద్గాం గ్రామాల పరిధిలో... మంజీరా నదిలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇసుకను తరలిస్తున్నారు. అభివృద్ధి పనులతోపాటు పట్టణ ప్రాంతాల్లో భవనాల నిర్మాణం కోసం... వందల లారీల్లో ఇసుక రవాణ జరుగుతోంది. గతేడాది బిచ్కుంద నుంచి రీచ్‌లు ఉండే కుర్లాం వరకు రోడ్డు నిర్మించారు. మంజీరా నది నుంచి రోడ్డు వరకు... బిచ్కుంద మీదుగా లారీల రాకపోకలు సాగిస్తున్నారు. అతివేగం, పరిమితికి మించి సామర్థ్యంతో లారీలు నడపడంతో రోడ్లు పాడవడమే కాకుండా ప్రజల ప్రాణాల మీదికి తెస్తోంది.

తీవ్రగాయాలతో..

ఈనెల 28న ఇసుక లారీ ఓ యువకుడ్ని ఢీకొట్టింది. బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇసుక రవాణే ప్రమాదానికి కారణమని భావించిన గ్రామస్థులు... ఆగ్రహంతో లారీకి నిప్పు పెట్టి.... కొన్నింటిని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడి చేశారు. బిచ్కుంద మీదుగా లారీలు వెళ్లకుండా అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు.

రోడ్లన్నీ దెబ్బతింటున్నాయ్..

ఇష్టారీతిన సాగుతున్న ఇసుక రవాణాతో గతేడాది నిర్మించిన రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దుమ్ము, దూళి వ్యాపించి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. తమ గ్రామం నుంచి కాకుండా ఇసుక రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని బిచ్కుంద ప్రజలు కోరుతున్నారు.

అభివృద్ధి పనుల పేరుతో నకిలీ వే బిల్లులు చూపిస్తూ రాత్రి వేళల్లో ఇసుక తరలించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఇసుక లారీల మోత భరించలేకపోతున్నాం మహాప్రభో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.