కామారెడ్డి జిల్లాలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి. పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో సోదాల అనంతరం ఏసీబీ అధికారులు కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. పలు రికార్డులు పరిశీలించారు.
ఐపీఎల్ బెట్టింగ్ కేసులో బెయిల మీద విడుదల చేసేందుకు సుధాకర్ అనే వ్యక్తిని రూ.5లక్షలు సీఐ జగదీశ్ డిమాండ్ చేయగా.. ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. పట్టణ సీఐ జగదీశ్‌తో పాటు సహకరించిన సుజయ్లను అనిశా అరెస్ట్ చేసింది. వీరిద్దరి విచారణలో వెల్లడైన అంశాలతో డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్రపై ఏసీబీ అధికారులకు అనుమానం కలిగింది. సెలవులో ఉన్న లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి కామారెడ్డిలోని తన కార్యాలయానికి వచ్చారు. డీఎస్పీతో పాటు ఓ ఎస్సై, మరో కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లుగా ఏసీబీ అనుమానిస్తోంది. వీరందరిని అనిశా విచారిస్తోంది.
- ఇదీ చూడండి: మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్