వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ సీఐ డి. రవిరాజాను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ ఐజీ, ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 13 నెలలుగా రవిరాజా కమలాపూర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతనిపై వచ్చిన పలు అవినీతి ఆరోపణలు రుజువుకాగా సస్పెన్షన్ వేటు పడింది.
ఇసుక వ్యవహారంతో పాటు పలు కేసుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గతంలోనే ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. అయినా అతని తీరు మారకపోవడం వల్ల అధికారులు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్