ETV Bharat / jagte-raho

ఏపీ: జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి... ఖండించిన నేతలు - జడ్జి రామకృష్ణ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ సోదరుడు, ఆ రాష్ట్ర మాలమహానాడు నాయకుడి రామచంద్రపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దాడిని ఖండించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాశారు. ఎస్సీల పట్ల అరాచాలకు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

judge-ramakrishnas-brother-ramachandra-was-attacked-by-bulls-in-chittoor-district
ఏపీ: జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి...ఖండించిన నేతలు
author img

By

Published : Sep 28, 2020, 11:46 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ తమ్ముడు, మాల మహానాడు నాయకుడు రామచంద్రపై... ఆదివారం దాడి జరిగింది. రాడ్​లతో దాడి చేయడం వల్ల రామచంద్ర ముఖం, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మదనపల్లెకు తీసుకెళ్లారు.

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి

కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు రామచంద్ర తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉండగా... ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. రోడ్డుపై నున్న తోపుడు బండి పక్కకు తీయాలంటూ కారులోని వారు గొడవ పడ్డారని.... ఆ సమయంలో అక్కడే ఉన్న తాను జోక్యం చేసుకోవడంతో దాడి చేశారని చెప్పారు. రామచంద్రపై దాడి వెనుక రాజకీయ కోణం లేదని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి, ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బడుగు, బలహీనవర్గాలే లక్ష్యంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రామచంద్రను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఖండించిన నేతలు...

రామచంద్రపై దాడిని ఖండించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌.. జడ్జి రామకృష్ణ కుటుంబసభ్యులను వేధిస్తున్న వైకాపా నాయకులతో పాటు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు హెచ్చరించారు. ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. అదే ఎస్సీలపై దమనకాండకు పాల్పడుతోందని ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.

ఇదీ చదవండి: జగన్‌కు పాలనపై అవగాహన లేదు: సత్యకుమార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.