చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగపత్రంలో జయరాం మేనకోడలు శిఖా చౌదరికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే 8మందిని అరెస్ట్ చేశారు. కార్మిక సంఘం నాయకుడు బీఎన్ రెడ్డికి కూడా జయరాం హత్యతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అభియోగపత్రంలో పొందుపర్చారు.
జయరాం హత్యకు ముందు రెండు రోజులు... బీఎన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బీఎన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన పాత్రపైనా సందేహాలు నెలకొనడంతో పోలీసులు బీఎన్ రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో సంబంధాలున్నాయనే విషయంలో ఇప్పటికే ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిలో ఒక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:చిల్లర రాజకీయాలు చేయొద్దు: కేటీఆర్