ETV Bharat / jagte-raho

జంగా రాఘవరెడ్డికి 5 రోజుల పాటు జ్యుడీషియల్​ రిమాండ్​ - janga raghava reddy news

జనగామ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్​ పోలీసులు.. జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు 5 రోజుల పాటు రిమాండ్​ విధించింది. అనంతరం వరంగల్​ సెంట్రల్​ జైలుకు పోలీసులు తరలించారు.

janga raghavareddy , ramand
జంగా రాఘవరెడ్డి, జనగామ
author img

By

Published : Jan 1, 2021, 2:21 PM IST

జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఓ వ్యక్తిని బెదిరించడానే కారణంతో వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్​లో ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. రెండు నెలల పాటు రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలించారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి తన స్వగామ్రానికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం హన్మకొండలోని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ కాపీ అందకపోవడంతో 5 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చదవండి: జనగామ కాంగ్రెస్​ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.