ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో భరత్ అలియాస్ బన్నీ(12) తల్లి ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయింది. అయిన వారి నుంచి ఆదరణ లేదు. తరచూ ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని బంధువులు తెలిపారు. రెండురోజుల క్రితం బాలుడు తన పెదనాన్న సురేశ్ ఫోన్‌ను తస్కరించి ఓ వ్యక్తికి అమ్మాడని తెలిపింది.
భరత్‌ను మొబైల్‌ను విక్రయించిన చోటుకు తీసుకెళ్లగా... వాళ్లు బాలుడిపై దాడి చేశాడని పెదనాన్న సురేష్ చెబుతున్నాడు. భరత్‌ను ఇంటికి తీసుకెళ్లగా.. ఉదయానికి చనిపోయాడని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
మృతదేహంతో సంఘటనా స్థలానికి వచ్చి న్యాయం చేయాలని మృతుని బంధువులు ఆందోళనకు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్