రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పీఎస్ పరిధిలోని తట్టి అన్నారంలో నివాసముండే కుమారి లారా అనే ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో గొడవ పడి బయటికి వెళ్లిన లారా తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికినా కుటుంబ సభ్యులకు లారా ఆచూకీ లభించకపోవడం వల్ల తండ్రి రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హయత్నగర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి లారా ఆచూకీ కోసం వెతుకుతున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి: చెబితే వినాలి... లేకుంటే కేసులు తప్పవు