రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తొర్రుర్కు చెందిన విద్యార్థిని అదృశ్యమైంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి... ఆన్లైన్ క్లాస్ అర్థం కావడం లేదని తల్లికి చెప్పింది. తెల్లారితే పరీక్ష పెట్టుకుని క్లాస్ అర్థంకావటంలేదని చెప్పటమేంటని కూతురిని ఆ తల్లి మందలించింది.
మందలింపుతో మనస్తాపం...
తల్లి మందలింపుతో మనస్తాపం చెందిన మౌనిక... మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... అన్ని చోట్ల వెతికినా లాభం లేకపోయింది. నిన్నటి వరకూ... ఆచూకీ లభ్యం కాకపోవటం వల్ల తల్లితండ్రులు హయత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన దృశ్యాలు, ఇతర సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు.