ETV Bharat / jagte-raho

అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం​ - Mancherial District Latest News

మంచిర్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్​ జిల్లా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Inter-district robbers arrested in mancherial district
అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్.. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం​
author img

By

Published : Dec 28, 2020, 4:38 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, రామకృష్ణాపూర్​లలో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరు అంతర్​ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కాసిపేట మండలం సోమగూడెం పెద్దనపల్లి కొత్త కాలనీకి చెందిన సంపత్​, బండారు లక్ష్మిలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 21 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ ఉదయ్​కుమార్​ రెడ్డి వెల్లడించారు.

సంపత్ మీద ఇది వరకే పీడీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు డీసీపీ వివరించారు. అయినప్పటికీ దొంగతనాలు మానకపోవడంతోపాటు అదే వృత్తిని సాగిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

ఇదీ చూడండి: మహిళ దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.