ETV Bharat / jagte-raho

వైద్యసిబ్బంది నిర్లక్ష్యం... పురిట్లోనే పసికందు మృతి - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

పెళ్లైన అయిదేళ్లకు తల్లినవ్వబోతున్నానన్న సంతోషం ఆ మహిళకు ఎంతోకాలం నిలువలేదు. మరికొన్ని క్షణాల్లో చిన్నారి తన కళ్లముందుకు రాబోతుందనుకున్న ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ పసికందు బలైంది. విగత జీవిగా ఉన్న ముద్దులొలికే చిన్నారిని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

infant died in doing birth surgery in suryapet
వైద్యసిబ్బంది నిర్లక్ష్యం... పురిట్లోనే పసికందు మృతి
author img

By

Published : Nov 11, 2020, 10:16 AM IST

సూర్యాపేట జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ శిశువును బలితీసుకుంది. కాన్పు సమయంలో నిర్వహించిన ఆపరేషన్​లో తలకు తగిలిన కత్తి గాటుతో శిశువు మృతి చెందింది. విధుల్లో ఉన్న వైద్యురాలు ఆపరేషన్ గదికి రాకుండానే కిందిస్థాయి సిబ్బందితో కాన్పు చేయించడంతోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

తీరని శోకం...

పెళ్లైన ఐదేళ్ల తర్వాత తల్లినికాబోతున్నానని సంతోషంగా ఉన్న శ్రీలత అనే మహిళకు విషాదమే మిగిలింది. పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన ఒగ్గు శ్రీలత మొదటి కాన్పు కోసం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిన్న ఉదయం చేరింది. మంగళవారం అర్ధరాత్రి ఆమెకు సాధారణ కాన్పు అవుతుందని చెప్పి ఆపరేషన్ గదిలోకి తీసుకెళ్లిన వైద్య సిబ్బంది, కొద్దిసేపటికి సాధారణ కాన్పు కావడంలేదని చిన్న ఆపరేషన్ చేస్తున్నామని చెప్పారని బంధువులు తెలిపారు. కాన్పు సమయంలో వైద్యురాలు రాలేదని బంధువులు పేర్కొన్నారు. సాధారణ కాన్పు తామే చేస్తామని చెప్పి... కింది స్థాయి వైద్య సిబ్బంది ఆమెకు కాన్పు చేశారని అన్నారు.

శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మగ శిశువు తలకు కత్తి గాటు తగిలిందని... గది బయట ఉన్న బంధువుల వద్ద ఉన్న వస్త్రాలను తీసుకెళ్లిన సిబ్బంది శిశువు తల నుంచి వస్తున్న రక్తాన్ని ఆపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అప్పటికే శిశువు మృతి చెందడంతో... బాబు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఐసీయూలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.

గంటలు గడుస్తున్నా బాబు పరిస్థితి చెప్పడంలేదని ఐసీయూ దగ్గరికి వెళ్లిన బంధువులకు అసలు విషయం తెలిసిందన్నారు. ఎటువంటి స్పర్శ లేకుండా ఉన్న శిశువును పరిశీలించిన బంధువులకు తలకు ఉన్న గాయం కనిపించిందని పేర్కొన్నారు. శిశువు బంధువులు దాడి చేస్తారని గ్రహించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రేమించిన వాడే కడతేర్చాడు..రెండేళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.